- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బుధవారం నుంచి దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బుధవారం నుంచి దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బేగం పేట విమానాశ్రయం నుంచి నేరుగా కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అనంతరం కొచ్చి దగ్గర శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ తరుణంలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఈరోజు(గురువారం) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తంజావూర్(Thanjavur) సమీపంలోని శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఉమా దేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్ సంప్రదాయబద్ధంగా పూజలు కార్యక్రమాలు చేశారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ‌్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్(Akhira Nandhan), తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.






