ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

by Muthe.Rajitha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని ఆదివారం సందర్శించారు.

ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని ఆదివారం సందర్శించారు. కాగా భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొని, భగవద్గీత పఠించారు. అనంతరం ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని పిలుపునిచ్చారు. తన గోశాలలో 60 కి పైగా ఆవులు ఉన్నాయని, గోమాత ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. అలాగే ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని కోరారు.

Next Story