AP Deputy CM:పవన్ కళ్యా‌ణ్‌కు మరోసారి అస్వస్థత?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-15 07:28:56.0  )
AP Deputy CM:పవన్ కళ్యా‌ణ్‌కు మరోసారి అస్వస్థత?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) కేబినెట్ భేటీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. ఏపీ కేబినెట్ భేటీలో(AP Cabinet Meeting) మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా కనిపించింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభమయ్యే లోపే ఆరోగ్యం సహకరించక అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలోనూ పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed