కీలక కార్యక్రమం.. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకు పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 13:45:27  IST  )

ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకు పవన్ కల్యాణ్ బయల్దేరి వెళ్లారు..

కీలక కార్యక్రమం.. ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకు పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎమ్మెల్యే(Mla), ఎంపీ(Mp) ఎన్నికలు ఒకేసారి జరిగితే ఖర్చు కలిసి రావడంతో పాటు పలు ఇబ్బందులు, సమస్యలు కూడా ఉండవని కేంద్రప్రభుత్వం(Union Government) భావిస్తోంది. ఇందులో భాగంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’(One Nation-One Election) ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఒకేసారి ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్నికలపై అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు నేతలు, ప్రజల అభిప్రాయం, సలహాలు, సూచనలను స్వీకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు పలువురు కీలక నేతలను భాగస్వాములను చేసింది.

చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి చెన్నైకు బయల్దేరారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీయే నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన నేరుగా చెన్నైకు బయల్దేరి వెళ్లారు. ఈ రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం జరిగే ఒకే దేశం-ఒకే ఎన్నిక కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు చెన్నై అధికార యంత్రాంగం పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీకి పవన్ రానున్నారు.

Next Story