సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-28 15:02:22  IST  )

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు.

సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు. అమరావతి రాజధాని కోసం మెజారిటీ శాతం రైతులు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారని తెలిపారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డిందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మద్దతుతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానన్నారు.

పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తిన చంద్రబాబు.. అసెంబ్లీ సాక్షిగా ప్రశంసల వర్షం

Next Story