వారి కాళ్లు పట్టుకుని పవన్ కల్యాణ్ క్షమాపణలు అడగాలి.. పోసాని సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2024-02-20 14:30:41  IST  )

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి జనసేనాని పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారి కాళ్లు పట్టుకుని పవన్ కల్యాణ్ క్షమాపణలు అడగాలి.. పోసాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి జనసేనాని పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమనడం వ్యభిచారం తో సమానం అని ఆరోపించారు. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన పవన్ కళ్యాణ్.. కాపులను మోసం చేసినట్లే అని అన్నారు. రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫింగ్ జరుగుతుందని పవన్ ఆరో పంచడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. తమ ఊళ్లలో ఎవరి పని వారు చేసుకుంటున్నారని.. అలాంటి, ఆడబిడ్డలను పవన్ ఉమెన్స్ ట్రాఫికింగ్ జరుగుతుందనడం ఆన్యాయం.. అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గుపడాలని.. ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేనాని పవన్ కల్యాన్ క్షమాపణలు చెప్పాలని.. కనీసం కాపు మహిళల కాళ్లు పట్టుకుని క్షమాపణలు ఆడగాలని పోసాని కృష్ణ మురళి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పవన్ అభిమానులు పోసాని పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. కీలక జిల్లాలో తొలి బహిరంగ సభ

Next Story