మరో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలి..డిప్యూటీ సీఎం పవన్‌ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మ‌రో 15ఏళ్లు కూట‌మి ఐక్య‌త కొన‌సాగాల‌ని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మరో 15 ఏళ్లు కూటమి ఐక్యత కొనసాగాలి..డిప్యూటీ సీఎం పవన్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌రో 15ఏళ్లు కూట‌మి ఐక్య‌త కొన‌సాగాల‌ని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో జాతీయ ర‌హ‌దారుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ మాట్లాడారు. కూట‌మి ఐక్య‌త దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటార‌ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా స‌ర్దుకుపోవాల‌ని అన్నారు. కూట‌మి ఏర్పాటు కోసం తాను చేసిన ప్ర‌య‌త్నాలు ఫలించాయ‌ని చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి ప‌థంలో ఏపీ ముందుకువెళుతోంద‌ని అన్నారు. దేశ అభివృద్ధిలో ఏపీ ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం వ‌హించాల‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ్యాతి న‌లుమూల‌లా వ్యాపించాల‌న్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్ర‌బాబు నాయ‌క‌త్వం కావాల‌ని, దేశ అభివృద్ధికి మోడీ నాయ‌కత్వం కావాల‌ని చెప్పారు. రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణాల వ‌ల్ల వ్యాపార అభివృద్ధితో పాటు ఉపాది అవ‌కాశాలు పెరుగుతాయ‌న్నారు.

Next Story