కూలీల దుర్మరణం బాధాకరం.. పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-14 05:24:31  IST  )

అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు

కూలీల దుర్మరణం బాధాకరం.. పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వీరంతా మామిడి కోతకు సంబంధించిన కూలీలు అని అధికారుల ద్వారా సమాచారం వచ్చింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగానికి సూచించాను. బాధిత కుటుంబాలను ప్రభుత్వం(AP Government) తగిన విధంగా ఆదుకుంటుంది’’ అని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story