Pawan Kalyan: కడప జిల్లా ప్రజలకు పవన్ కల్యాణ్ సంచలన హామీ

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన ప్రకటన చేశారు.

Pawan Kalyan: కడప జిల్లా ప్రజలకు పవన్ కల్యాణ్ సంచలన హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన ప్రకటన చేశారు. కడప ప్రభుత్వ స్కూల్‌(Kadapa Govt School) కిచెన్‌ ఆధునీకరణకు తన సొంత నిధులు ఇస్తానని ప్రకటన చేశారు. విద్యార్థినుల ఆటలకు అవసరమైన నిధులన్నీ తానే సమకూరుస్తానని కూడా మాటిచ్చారు. ‘నా నిజమైన హీరో టీచరే(Teacher).. స్కూల్స్‌ను ఇతర కార్యక్రమాలకు వాడినా.. కబ్జా చేసినా కేసులు పెడతాం.. రాయలసీమ తెగింపుల నేల.. ఆడపిల్లలను ఏడిపిస్తే సహించను.. రాయలసీమ(Rayalaseema) అంటే వెనుకబడిన ప్రాంతం కాదు.. సాహిత్యానికి నిలయం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

శనివారం కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం కడప అని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(Uyyalawada Narasimha Reddy) వంటి మహనీయులు పుట్టిన నేల అని కొనియాడారు. ‘కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నా. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నా’ అని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Next Story