- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:‘అవి సరదాకి మాత్రమే’.. ఆ డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నరసింహపురంలో 12 ఎకరాల్లో రూ.1,290 కోట్లతో చేపట్టబోయే అతిపెద్ద తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan kalyan) ఇవాళ(శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో మార్కాపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ‘రప్పా రప్పా నరుకుతాం’ వివాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు.
ప్రేక్షకులను చీర్ అప్ చేయడానికి సినిమాల్లో డైలాగులు చెప్తామని, నిజ జీవితంలో అవి బాగుండవు అని తేల్చి చెప్పారు. ‘కుత్తుకలు కోస్తాం. మెడకాయలు కోస్తామంటే మేం ఏమైనా కోయించుకోవడానికి చొక్కా విప్పి చూపిస్తామా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను సినిమాల్లో నుంచి వచ్చిన.. కానీ నాకు సినిమా డైలాగులు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతా అన్నారు. ఈ క్రమంలో ‘సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటా’ అనే డైలాగులు సరదాకి మాత్రమే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.






