- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: బెంగళూరు తొక్కిసలాటపై స్పందించిన పవన్ కళ్యాణ్
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేధికగా స్పందించారు. విజయోత్సవంలో తొక్కిసలాట జరగటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం దిగ్బ్రాంతికి గురిచేస్తోందన్నారు. ఈ ఘటన చాలా హృదయ విదారకమైనది అని పేర్కొన్నారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉండటం మరితం బాధిస్తోందని అన్నారు. వేడుకలు చేసుకోవాల్సిన సమయం ఇంత విషాదంగా మారడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. విధుల్లో 5వేల మంది పోలీసులు ఉన్నారని తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారని, పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.






