- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో 40 బోట్లు అగ్నికి ఆహుతి కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో 40 బోట్లు అగ్నికి ఆహుతి కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బోట్లపై ఆధారపడిన మత్స్యకారులకు జీవన భృతి అందించాలని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి.. భద్రతపరమైన అంశాలపై సమీక్షించాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
Next Story






