థియేటర్ల బంద్ ఇష్యూలో పవన్ యాక్షన్ స్టార్ట్.. కీలక నేతను పార్టీ నుంచి తొలగింపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-27 09:51:04  IST  )

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్ల బంద్ ఇష్యూలో పవన్ యాక్షన్ స్టార్ట్.. కీలక నేతను పార్టీ నుంచి తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ(Janasena Party) రాజమండ్రి ఇన్‌చార్జి బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణ(Atti Satyanarayana)ను తొలగించారు. పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేశారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వామిగా ఉన్నట్లు సత్యానారాయణపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్తి సత్యనారాయణపై వచ్చిన ఆరోపణలు నిజమో.. కాదో తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కాగా, టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ తీవ్ర రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకోవడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఓ నలుగురు కీలక నిర్మాతల హస్తం ఇందులో ఉందనీ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్, దిల్‌రాజు వంటి ప్రొడ్యుసర్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమకు సంబంధం లేదని.. అనవసరంగా తమను ఈ ఇష్యూలోకి లాగుతున్నారని చెప్పారు. ఇప్పటికే థియేటర్ల బంద్ ఇష్యూలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి తొలగిస్తూ పవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story