Pawan Kalyan పయనమెటు?

by Disha Web Desk 16 |
Pawan Kalyan పయనమెటు?
X

దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఇప్పటం (Ippatam) గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ధర్మాసనం జరిమానా విధించింది. ధర్మాసనానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు గురువారం ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతలపై 14 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని కోర్టుకు విన్నవించారు.

ఇదిలా ఉంటే ఇప్పటంలో నిర్మాణాల తొలగింపును అటు జనసేన (Janasena) ఇటు టీడీపీ (Tdp), ఇతర వామపక్షాలు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)లు ఏకంగా ఇప్పటం వెళ్లి మరీ పరామర్శించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కారుపై కూర్చుని మరీ వెళ్లి ఇప్పటం గ్రామస్తులను కలిశారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కూల్చివేతల ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అంటూ భరోసా ఇచ్చారు. తన సభకు స్థలాలు ఇచ్చారనే అక్కసుతో వారి ఇళ్లు కూల్చివేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అనంతరం గ్రామంలో కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం అందిస్తానని ప్రకటించారు. ఈనెల 27 ఆదివారం పవన్ కల్యాణ్ నేరుగా ఇప్పటం వెళ్లనున్నారు. ఇప్పటం గ్రామంలో బాధితులకు స్వయంగా రూ.లక్ష చొప్పన ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారైన సంగతి తెలిసిందే. మరి కోర్టు తీర్పుతో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప అభివృద్ధి ఎక్కడ?


Next Story

Most Viewed