ఇంద్రకీలాద్రికి చేరుకున్న పవన్ కల్యాణ్

by Disha Web |
ఇంద్రకీలాద్రికి చేరుకున్న పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్నారు. జనసేన ప్రచార రథం వారాహికి పూజలు చేయించేందుకు గాను పవన్ నేడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి రానున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే కొండపైకి జనసేన వారాహి వాహనం చేరుకుంది. కొద్ది సేపట్లో పవన్ కల్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు గాను దుర్గగుడి రాజగోపురం దగ్గర వాహన పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు.

Also Read...

పవన్ పోటీ ఎక్కడి నుంచి?


Next Story