- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR ట్రస్ట్‌కు రూ.50 లక్షలు అందజేసిన పవన్ కల్యాణ్
తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కలిసి నారా భువనేశ్వరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night) అనే ఈవెంట్‌ను కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తలసీమియా చిన్నారుల కోసం రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా ఆ విరాళాన్ని చెక్ రూపంలో ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అందించారు. ఆరోజు పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసీమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తుంది. విదేశాల నుంచి వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ఆయన అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం.. ఇప్పుడు తలసీమియా బాధితుల కోసం ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని పవన్ కల్యాణ్ కొనియాడారు.






