స్వయంగా వారికి మామిడి పళ్లు పంపిన పవన్ కల్యాణ్.. ఎంత ప్రేముంటే ఇలా చేస్తాడు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-05 08:40:22  IST  )

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గిరిజనులపై తనకున్న ప్రత్యేక ప్రేమను మరోసారి చాటుకున్నారు.

స్వయంగా వారికి మామిడి పళ్లు పంపిన పవన్ కల్యాణ్.. ఎంత ప్రేముంటే ఇలా చేస్తాడు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గిరిజనులపై తనకున్న ప్రత్యేక ప్రేమను మరోసారి చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామస్థుల కోసం తన స్వంత పొలాలలో పండిన ఆర్గానికి మామిడి పండ్లను స్వయంగా పంపించారు. దాదాపు 230 వరకు ఇళ్లు ఉండే కురిడి గ్రామంలో ఇంటికి అరడజను చొప్పున మామిడి పండ్లను అందించారు.

ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమ, మమకారం ఈ చర్యలో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ రైతుగా ఉన్న తన నేపథ్యాన్ని మర్చిపోకుండా, ప్రజలతో గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ చూపిన ఈ అందమైన చర్య గ్రామస్థుల మన్ననలు అందుకుంది. 'మా పవన్ కల్యాణ్ సారు పంపిన మామిడి పండ్లు' అంటూ పిల్లలు,పెద్దలు ఇష్టంగా వాటిని తిన్నారు. పవన్ సారు చల్లగా ఉండాలంటూ ఆశీర్వదించారు.

కాగా, ఇటీవల'అడవి తల్లి బాట' కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు, కురిడి గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల రహదారి కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గ్రామస్థులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఏర్పడిన అనుబంధంతోనే ఇప్పుడు వారికి తన తోటలోని పండ్లను పంపించారు. గతంలో పెద్దపాడు గ్రామస్ధులకు చెప్పులు అందజేశారు.

Next Story