- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమెతో కలిసి భోజనం చేసిన పవన్ కల్యాణ్.. బహుమానంగా చీర, లక్ష నగదు
జనసేన(Janasena Party) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన(Janasena Party) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోని ఏ హీరోకి లేని కల్ట్ ఫ్యాన్స్ పవన్‌కు ఉన్నారని స్వయంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలే పలుమార్లు ప్రస్తావించడం మనం చూశాం. అయితే.. పవన్ అభిమానులంతా 20 ఏళ్ల కుర్రాళ్లే అని.. మహా అయితే 40 ఏళ్ల వాళ్లలోనూ కొందరు ఉండొద్దని గిట్టని వారు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇవాళ చోటుచేసుకున్న సన్నివేశం వారందరికి సమాధానం అని జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency), యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు(96) పవన్ కల్యాణ్ అభిమాని. పవన్ మీదున్న అభిమానంతో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని ఎన్నికల వేళ మొక్కుకున్నారు. ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించి, డిప్యూటీ సీఎం కావడంతో తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి, రూ.27వేలతో అమ్మావారికి గరగ చేయించి సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. పేరంటాలమ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. శుక్రవారం ఆమెతో కలిసి భోజనం చేశారు. అనంతరం చీరను, లక్ష రూపాయల నగదును ఆమెకు అందించారు.






