- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JSP: పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్ అదుర్స్ (PHOTO)
సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులంతా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక(Jana Sena Formation Day) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులంతా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక(Jana Sena Formation Day) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన ఈ మహా వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను పార్టీ నాయకత్వం విడుదల చేసింది. ఈ కొత్త ఫొటో పవన్ కల్యాణ్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
మరోవైపు జనసేన పార్టీ(Jana Sena Party) ఆవిర్భావ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలసి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తుంది.
‘నభూతో నభవిష్యత్’ అనే విధంగా ఏర్పాట్లు చేయాలని నాయకులకు మనోహర్(Minister Manohar) సూచించారు. భూమి పూజకు ముందు సభా ప్రాంగణం అంతా కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. లక్షలాదిగా తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సభా ప్రాంగణం దగ్గర ద్వారాలను ఏర్పాటు చేయాలని, సభ వేదికకు దారి తీసే ప్రతి మార్గం జనసేన ప్లెక్సీలతో అలంకరించాలని, కూడళ్లలో పార్టీ తోరణాలు కట్టాలని పబ్లిసిటీ, డెకోరేషన్ కమిటీలకు సూచనలు చేశారు.






