‘సమయం ఆసన్నమైంది’.. మళ్లీ ఆ డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపించాలని డిమాండ్ చేశారు.

‘సమయం ఆసన్నమైంది’.. మళ్లీ ఆ డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఒక పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర అయితే.. తిరుమల లడ్డూ అంటే ఒక భావోద్వేగం అని పేర్కొన్నారు. ప్రతి ఏటా తిరుమలకు 2.5 కోట్ల మంది భక్తులు వస్తున్నారని అన్నారు. సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని వెల్లడించారు. తిరుమల వచ్చిన భక్తులంతా.. ఇక్కడి నుంచి తీసుకెళ్లే లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకికతత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story