Pawan Kalyan: జనసేన అధినేత పవన్ పర్యటన వాయిదా.. ఆందోళనలో జనసేన శ్రేణులు!

by Kema Shiva Kumar |

సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ పర్యటన వాయిదా.. ఆందోళనలో జనసేన శ్రేణులు!
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర అస్వస్థకు గురికావడంతో మరోసారి తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయనకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని డాక్టరల్లు తెలిపారు. ఈ మేరకు యాత్రకు సంబంధించి మరో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ జనసేన అధినేత వపన్ ట్విట్టర్ వేదిక విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడిన తరవాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటాను’. అంటూ ట్వీట్ చేశారు.

Next Story