- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మాజీ గవర్నర్ తరుఫున తమిళనాడులో పవన్ ప్రచారం
2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాగా ఎన్నికల్లో తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. కాగా ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై చెన్నై సౌత్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు వారు స్థిరపడి ఉన్నారు. దీంతో తమిళిసై తరపున ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్ షో లో పాల్గొననున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తరుఫు తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో టీడీపీ నేత నారా లోకేష్ ప్రచారం చేశారు.
Next Story






