జనసేన పార్టీ కోసం పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2024-03-30 13:39:49  IST  )

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పుడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జనసేన పార్టీ కోసం పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పుడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్వాహన అవసరాల కోసం ఏకంగా రూ. 10 కోట్లను విరాళంగా అందించారు. ఇప్పటికే తన షూటింగ్ నుంచి వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఆయన తన కష్టార్జితాన్ని కూడా పార్టీ అవసరాల కోసం విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ నేతల స్ఫూర్తితో తాను కష్టపడి సంపాదించిన డబ్బును పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉంటానని.. ఇందులో భాగంగా.. ఎన్నికల నిర్వహణ కోసం రూ. 10 కోట్ల చెక్కును జనసేన పార్టీ ట్రేజరి రత్నం గారికి అందజేస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Next Story