- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR ఏనాడు అలా చేయలేదు.. పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భీమవరంలో ఆయన వారాహి విజయ యాత్రంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో సినిమా హీరోలు సహకరించలేదని.. కొంత మంది కాంగ్రెస్‌లో కూడా ఉన్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కోట శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. ఎంత విమర్శించినా కృష్ణను ఎన్టీఆర్ ఒక్క మాట అనలేదన్నారు. అదే ఎన్టీ రామారావు సంస్కారం అని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విభేదాలు ఉన్నా కానీ తనను ఏం అనలేదని.. తన సినిమాలను ఆపలేదన్నారు. మీరంతా అభిమానించే చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబులను ఇంటి బయట ఆపించి వాళ్లను నడిపించి.. కనీసం బోజనం కూడా పెట్టకుండా జగన్ అవమానించారన్నారు. లక్షలాంది గుండెల్లో పెట్టుకున్న హీరోలంటే జగన్‌కు కుళ్లు అన్నారు. జగన్ కలుగులో ఎలుక లాంటి వాడని అందుకే హీరోలను చూసి తట్టుకోలేకపోయాడన్నారు.
Read more : తిరుమలలో అన్యమత ప్రచారం..ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు






