తిరుమలలో అన్యమత ప్రచారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
తిరుమలలో అన్యమత ప్రచారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో అన్యమత ప్రచారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో వారాహి విజయ భేరీలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ అందరికీ సంపూర్ణంగా ఉందని.. జూలియా రాబర్ట్స్ లాంటి క్రిస్టియానిటీలో పుట్టిన వ్యక్తి హిందూ మతంలోకి మారినప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. కానీ తిరుపతి, తిరుమలలో అన్యమత ప్రచారం సరికాదన్నారు. అంబేద్కర్ చెప్పిన విధంగా ఎవరి మతాలను వారు ప్రచారం చేసుకోవచ్చని.. కానీ మసీదు, చర్చికెళ్లి హిందూ ధర్మాన్ని ప్రభోదించకూడదన్నారు. అలాగే హిందూ దేవాలయాలకు వెళ్లి అన్య మతాలను ప్రచారం చేయకూడదన్నారు. తాను చెప్పింది తప్పయితే తనను ఉరి తీయాలని పవన్ అన్నారు. ఇలా మాట్లాడితే కొంత మంది ఓట్లు పడవనే భయం తనకు లేదన్నారు. ఏది సరైందనుకుంటే అదే మాట్లాడతానని పవన్ క్లారిటీ ఇచ్చారు.

Read more : NTR ఏనాడు అలా చేయలేదు..’..పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed