- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ విషయంలో చంద్రబాబును మించిపోయారు.. పవన్ కళ్యాణ్’.. వైసీపీ సంచలన ట్వీట్!
ఆరు నెలల ఎన్డీయే పాలనలో పంచాయతీ రాజ్ శాఖ అనేక మైలు రాళ్లను దాటిందన్న డిప్యూటీ సీఎం పవన్‌కు(Deputy CM Pawan Kalyan) వైసీపీ(YSRCP) కౌంటరిచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ఆరు నెలల ఎన్డీయే పాలనలో పంచాయతీ రాజ్ శాఖ అనేక మైలు రాళ్లను దాటిందన్న డిప్యూటీ సీఎం పవన్‌కు(Deputy CM Pawan Kalyan) వైసీపీ(YSRCP) కౌంటరిచ్చింది. గోరంతను కొండంతగా చేసి చూపించడంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మించిపోయారని వైసీపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. అయితే.. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద కేవలం 1800 కిలో మీటర్లు మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారన్నారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే 3,750 కి.మీ మేర సీసీ రోడ్లను నిర్మించారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై వైసీపీ స్పందిస్తూ.. అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో పవన్ కళ్యాణ్ గురువు చంద్రబాబును మించిన శిష్యుడయ్యాడని సెటైర్లు వేసింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లలో గుంతలను పూడ్చడమే కానీ రోడ్లు వేసింది మాత్రం శూన్యమనే చెప్పాలి. గుంతలు పూడ్చడానికి ఖర్చు చేసింది కేవలం రూ.860 కోట్లు మాత్రమే.. ఇక కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ప్రకటించి తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోల్ ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ ముసుగులో TDP పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారు. YCP ప్రభుత్వంలో ఒక సంవత్సరం కోవిడ్‌కు పోగా కేవలం 4 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేసింది. రోడ్ల మరమ్మతుల కోసం రూ.4,648 కోట్లు ఖర్చు చేసింది. రోడ్ల గుంతలు పూడ్చడం మాత్రమే కాదు. వాటితోపాటు పెద్ద సంఖ్యలో జగన్ సర్కారు కొత్త రోడ్లను నిర్మించింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది’’ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.






