టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల నినాదం ఇదే.. రివీల్ చేసిన పవన్ కల్యాణ్..!

by Satheesh |   ( Updated:2024-02-28 14:58:07.0  )
టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల నినాదం ఇదే.. రివీల్ చేసిన పవన్ కల్యాణ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల నినాదాన్ని రివీల్ చేశారు. బుధవారం టీడీపీ-జనసేన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగా సభను నిర్వహించింది. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే ఏపీ ప్రజల భవిష్యత్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల తరుఫున వచ్చే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్ని్కల్లో పొత్తు గెలవాలి.. జగన్ పోవాలి.. వైసీపీ నేలమట్టం అవ్వాలని ఫైర్ అయ్యారు. ‘హాలో ఏపీ.. బైబై వైసీపీ’ వచ్చే ఎన్నికల్లో ఇదే టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల నినాదం అని పవన్ కల్యాణ్ రివీల్ చేశారు.

పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలే తీసుకోవడంపైన పవన్ కల్యాణ్ ఈ సభలో క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలకు 24 సీట్ల పవర్ ఏంటో తెలియడం లేదన్నారు. బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు.. కానీ వామనుడు నెత్తిమీద పాదం పెట్టి తొక్కుంటే తెలిసింది ఆయన బలం ఏంటో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైసీపీకి వామన అవతారం చూపించి.. పాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. ఎన్నికలు ముగిశాక జనసేన 24 సీట్ల పవర్ ఏంటో వైసీపీకి తెలుస్తుందని అన్నారు. గతంలో జనసేన ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే రాత్రికి రాత్రి రాజమండ్రికి రోడ్లు వేశారని.. అదే ఇప్పుడు జనసేన 24 సీట్లు గెలిస్తే ఏం జరుగుతోందో ఆలోచించండని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Read More..

జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు: జనసేనాని ఫైర్

Advertisement

Next Story