- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్టీతో పోల్చవద్దు: తమిళ రాజకీయాలపై స్పందించిన పవన్ కల్యాణ్
తమిళనాడు హీరో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ విజయంతో ఏపీలో పవన్ కల్యాణ్ జనసేనను సోషల్ మీడియాలో పోల్చారు..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు హీరో విజయ్ పార్టీ(Tamil Nadu hero Vijay Party) ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ విజయంతో ఏపీ(Ap)లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) జనసేన(Janasena)ను సోషల్ మీడియాలో పోల్చారు. విజయ్ ఒంటరిగా పోటీ చేసి సీఎం అయ్యారని, పవన్ కల్యాణ్ కాలేకపోయారని విమర్శలు సైతం చేశారు. అయితే ఈ విమర్శలు, విజయ్ పార్టీ విజయంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరి(Mangiri)లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం(Jana Sena Party Intimate Meeting)లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పరిస్థితులు వేరు అని చెప్పారు. అలాగే విజయ్ పార్టీతో జనసేనను పోల్చవద్దన్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారని ఆయన గుర్తు చేశారు. అందరూ తనను వదిలేసినా పార్టీని ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. జనసేన లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ పార్టీ కాదని స్పష్టం చేశారు. వివిధ పార్టీల సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మంచి అంశాలతో జనసేనను స్థాపించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.






