‘ఆ పదవికి మీరు వన్నె తెస్తారని ఆశిస్తున్నా’.. అశోక్ గజపతి రాజుకు పవన్ కల్యాణ్ విషెస్

by Gantepaka Srikanth |

గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju)కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు.

‘ఆ పదవికి మీరు వన్నె తెస్తారని ఆశిస్తున్నా’.. అశోక్ గజపతి రాజుకు పవన్ కల్యాణ్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju)కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘‘గోవా రాష్ట్ర గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఎంపిక అవ్వడం సంతోషకరం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వహించి పదవికి వన్నె తీసుకొస్తారని ఆశిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా, సోమవారం మొత్తం మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నియమించారు. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ ఆషిమ్‌కుమార్‌ ఘోష్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది.

Next Story