సత్యసాయి శత జయంతి స్పెషల్.. పుట్టపర్తికి పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

పుట్టపర్తి సత్యసాయి బాబా(Sathya Sai Baba) శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ఆహ్వానించారు.

సత్యసాయి శత జయంతి స్పెషల్.. పుట్టపర్తికి పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టపర్తి సత్యసాయి బాబా(Sathya Sai Baba) శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ఆహ్వానించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి రత్నాకర్, ఇతర సభ్యులు మంగళవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు. నవంబర్ 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో, ప్రధానమంత్రితో కలసి వేడుకలకు హాజరవుతానని సత్యసాయి ట్రస్ట్(Sathya Sai Trust) బోర్డు సభ్యులకు పవన్ కల్యాణ్ తెలిపారు.

సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు. శత జయంతి ఉత్సవాలలోపు మందిరానికి అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌‌కు సత్యసాయి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story