పవన్ కల్యాణ్‌కు కొత్త బిరుదు

by Gantepaka Srikanth |

పవన్ కల్యాణ్‌కు కొత్త బిరుదు

పవన్ కల్యాణ్‌కు కొత్త బిరుదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు అరుదైన గౌరవం లభించింది. పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ 'అభినవ కృష్ణ దేవరాయ' అనే బిరుదును పవన్ కల్యాణ్‌కు ప్రదానం చేశారు. ఆదివారం పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరిచేందుకు ఏర్పాటు చేసిన ‘బృహత్‌ గీతోత్సవ’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవన్‌ హాజరయ్యారు. ఉడుపిలో శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘ధర్మాన్ని మీరు కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుంది. నా గోశాలలో 60 ఆవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆవులను సంరక్షించేందుకు ముందుకు రావాలి’’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

Next Story