- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన ఎమ్మెల్యేలకు పిడుగులాంటి వార్త.. ఆ రిపోర్ట్స్‌పైనే పవన్ చూపంతా..?
జనసేన పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి నేతలు, ఎమ్మెల్యేలపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై జనసేన(Janasena) అధిష్టానం ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయించింది. ఈ రిపోర్టును తన వద్దకు తెప్పించుకుంది.. ఈ మేరకు మంగళగిరి(Mangalagiri)లో పార్టీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది.
దీంతో జనసేన ఎమ్మెల్యేల(Mlas)తో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawankalyan) సమీక్ష నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై ఈ భేటీలో వివరణ కోరారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయించిన పవన్ కల్యాణ్.. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంక్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి






