- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయని ఆశా భోస్లే మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం
భారతీయ సినీ సంగీత రంగంలో అపూర్వ కీర్తి గడించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....

దిశ, ఏపీ బ్యూరో: భారతీయ సినీ సంగీత రంగంలో అపూర్వ కీర్తి గడించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. హిందీతో పాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ తదితర పలు భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు.
పాశ్చాత్య సంగీత శైలిలో కూడా పాటలు పాడి ఒక తరం యువతను ఆకట్టుకున్న అరుదైన గాయని ఆశా భోస్లే అని కొనియాడారు. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే’, ‘ఇన్ ఆంఖో కి మస్తీ’, ‘రాధా కైసే న జలే’ వంటి గీతాలతో కోట్లాది సంగీతాభిమానులను అలరించారని తెలిపారు. తెలుగులో పాటలు తక్కువే అయినప్పటికీ, హిందీ గీతాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనూ విశేష ఆదరణ పొందారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆశా భోస్లే కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.






