Pawan Kalyan: సమంగా అభివృద్ది.. సంక్షేమం

by Thanuru Gopichand |   (  Updated:2025-08-15 04:49:56  IST  )

ఆంధ్ర ప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది, ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్​పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​తెలిపారు.

Pawan Kalyan: సమంగా అభివృద్ది.. సంక్షేమం
X

సమంగా అభివృద్ది సంక్షేమం

పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యం

ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​

దిశ, డైనమిక్​ బ్యూరో : ఆంధ్ర ప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది, ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్​పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​తెలిపారు. కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృమూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం ప్రారంభిస్తున్నాం అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000 కి, మేజర్ పంచాయితీలకు 250 నుండి 25,000 కి పెంచి సర్పంచుల ఆత్మ గౌరవాన్ని కాపాడాం అన్నారు. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం.

పల్లె పండుగ ద్వారా 4000 కి.మీ.ల సీసీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, లక్ష నీటి కుంటలు, 15,000 నీటి తొట్టులు ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2000 కి.మీ.ల బిటి రోడ్లు, 14 కొత్త వంతె నలు నిర్మించామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి, ప్రమాద పరిహారం 50 వేల నుంచి 4 లక్షలకు పెంచాం . అడవితల్లి బాట" కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కి.మీ.ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అని తెలిపారు. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% కి పెంచే లక్ష్యంతో కోటి మొక్కలు నాటి వీటిని ట్రాక్ చేసే విధానం కూడా ప్రారంభించాం. ఏనుగులబెడద నివారణకు కర్ణాటక నుండి కుంకీ ఏనుగులు తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం అని తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జి, నగర వన యోజన కింద 1,122 కోట్లతో 61 ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

Next Story