- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన కోలుకుంటారనుకున్నా..మాగంటి మృతిపై పవన్ ఎమోషనల్
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. జూబ్లిహిల్స్ శాసనసభ్యులు, నిర్మాత గోపినాథ్ మరణించారని తెలిసి చాలా చింతించానని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. జూబ్లిహిల్స్ శాసనసభ్యులు, నిర్మాత గోపినాథ్ మరణించారని తెలిసి చాలా చింతించానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందని, కోలుకుంటారని భావించానని చెప్పారు.
2014 నుండి జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గోపినాథ్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోశించారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మాగంటి గోపినాథ్ ఇటీవల తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ఏఐజీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఉదయం 5గంటల ప్రాంతంలో కన్నుమూశారు. గోపినాథ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాధాపూర్‌లోని తమ నివాసంలో నేడు గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.






