- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కుమారుడికి సైక్రియాటిస్ట్‌తో చికిత్స
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగ్గా అక్కడే ఉన్న మార్ కూడా గాయపడ్డాడు. చికిత్స తరవాత మార్క్ కోలుకున్నా మానసికంగా ఆయన భయపడుతున్నట్టు పవన్ కల్యాణ్ నేడు ఓ సమావేశంలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడి చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పారు. అతని గొంతులోకి పొగ వెళ్లిందని గాయాలయ్యాయని తెలిపారు.
ఇప్పటికీ తన కొడుకు రాత్రిళ్లు నిద్రలేచి చాలా భయపడుతున్నాడని చెప్పారు. ఒక్కసారిగా భయంతో లేస్తున్నాడని, భవనం పై నుండి పడిపోయినట్టు ఆందోళన చెందుతున్నాడని అన్నారు. ప్రస్తుతం బాబును సైకియాట్రిస్ట్‌కు చూపిస్తున్నామని అన్నారు. అచ్చం తన కుమారుడిలానే మధుసూధన్ కుటుంబం అన్నారు. ఎంతో సరదాగా గడిపేందుకు పహల్గా వెళ్లారని కానీ ఈ విధంగా జరగడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాళ్లకు నిద్రపడుతుందా..బుల్లెట్ల శబ్దం కళ్ల ముందు తమ కుటుంబ సభ్యుడు చనిపోవడం ఆ షాక్ నుండి కోలుకోవడం కష్టం అని అన్నారు. ఆ బాధ ఏంటో తనకు తెలుసని చెప్పారు. ఇక పవన్ బాధితుడి కుటుంబానికి పార్టీ తరఫున రూ.50 లక్షల ఆర్థికసాయం కూడా ప్రకటించారు.






