- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పవన్ కళ్యాణ్.. ఇలా చేయడం న్యాయమా?’.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై పలువురు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోసాని అరెస్ట్ పై తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై మాజీ ఎమ్మెల్యే లక్ష్మి పార్వతి(Former MLA Lakshmi Parvathi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో టీడీపీ(TDP) హయాంలో నంది అవార్డులు(Nandi Awards) ఒకే వర్గానికి ఇస్తున్నారని, నంది పురస్కారం తిరస్కరించడం పోసాని చేసిన తప్పా అని మాజీ ఎమ్మెల్యే లక్ష్మి పార్వతి ప్రశ్నించారు. దేశంలో అనేక మంది పౌర పురస్కారాలను స్వీకరించలేదని తెలిపారు. ఐదేళ్ల క్రితం జరిగిన విషయం పై ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు వల్ల తనతో పాటు అనేక మంది దెబ్బతిన్నారని విమర్శించారు. కక్ష తీర్చుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా చేయడం న్యాయమా? అని ఆమె ఫైరయ్యారు.






