- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరైన పద్ధతిలో ఉందాం: కూటమి శ్రేణులకు పవన్ దిశానిర్దేశం
రాజకీయాల్లో విమర్శలు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దాడులు చేయడం పరిష్కారం కాదని, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేయాలని కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో విమర్శలు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దాడులు చేయడం పరిష్కారం కాదని, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేయాలని కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పికొట్టడం కంటే, బాధ్యతాయుతమైన ధోరణితో వ్యవహరించడమే సరైన పద్ధతి అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై..
గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణిపై జరిగిన అనుచిత వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అప్పట్లో జగన్ అటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహించారని, సొంత భార్యను కారుతో పోల్చి మాట్లాడిన వైనాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని ధ్వజమెత్తారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ నైజమని, కానీ కూటమి పార్టీలు ఆ బాటలో వెళ్ళకూడదని పవన్ హితవు పలికారు.
నేటికీ అభ్యంతరకర భాషను వాడుతూ...
వైఎస్సార్సీపీ నేతలు నేటికీ అభ్యంతరకర భాషను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని పవన్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వారి వాచాలత్వంలో మార్పు రాలేదని విమర్శించారు. ఎదుటివారి స్థాయికి మనం పడిపోకుండా, చట్టం పరిధిలో ఉంటూనే ప్రజాస్వామ్యబద్ధంగా వారి వైఖరిని ఎండగట్టాలని కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు.






