Pawan Kalyan | నేడు పలమనేరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు పలమనేరుకు వెళ్లనున్నారు.

Pawan Kalyan | నేడు పలమనేరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు పలమనేరుకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టరులో ఉదయం 10 గంటల 35 నిమిషాలకు పెంగరగుంట దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ (Helipad) వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరానికి (Kunki Elephants) 10 గంటల 50 నిమిషాలకు వెళ్లనున్నారు.

పర్యటనలో భాగంగా కుంకీ ఏనుగుల శిబిరాన్ని, గజారామాన్ని, నగరవనాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం రైతులతో సమావేశమై వారితో మాట్లాడనున్నారు. మధ్యామ్నం 12 గంటల 45 నిమిషాలకు తిరుగు ప్రయాణం కానున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Next Story