గిరిజనులకు గుడ్ న్యూస్.. 699 ప్రాజెక్టులకు అనుమతులు

by Vemula.Srinu Prasad |

విశాఖపట్నం సర్కిల్‌లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది...

గిరిజనులకు గుడ్ న్యూస్.. 699 ప్రాజెక్టులకు అనుమతులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam) సర్కిల్‌లోని గిరిజన ప్రాంతాల(Tribal areas) అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ(Andhra Pradesh Forest Department) కీలక నిర్ణయం తీసుకుంది. అటవీ సంరక్షణను పాటిస్తూనే, మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా మొత్తం 699 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా గిరిజన గ్రామాల పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది.

రవాణా రంగానికి ప్రాధాన్యత

ఈ అనుమతుల్లో భాగంగా రవాణా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 528 రోడ్డు పనుల కోసం 372.056 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 132 టవర్ల నిర్మాణానికి (14.185 హెక్టార్లు), ఇంటర్నెట్ సౌకర్యాల కోసం 18 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) ప్రాజెక్టులకు (3.120 హెక్టార్లు) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

త్వరగా పూర్తికి ప్రణాళికలు

వీటితో పాటు ప్రజారోగ్యం, తాగునీటి అవసరాల కోసం 21 పథకాలకు 4.201 హెక్టార్ల స్థలాన్ని అటవీ శాఖ కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో రవాణా, సమాచార మార్పిడి, స్వచ్ఛమైన తాగునీటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. అటవీ నిబంధనలకు లోబడి ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

Next Story