- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎం విజయ్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు
by Vemula.Srinu Prasad |
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు అందజేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్(Thalapathy Vijay)కు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Andhra Pradesh Deputy Cm Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు అందజేశారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని పవన్ వ్యక్తం చేశారు.
ప్రగతిశీల పాలన అందుతుంది..
విజయ్ నాయకత్వంలో తమిళనాడులో పారదర్శకమైన, ప్రగతిశీల పాలన అందుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తూ, సుసంపన్నంగా మారుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, ప్రజల సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story






