నందమూరి బాలకృష్ణ సహా విజేతలకు అభినందనలు: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

నేషనల్ అవార్డులు(National Awards) సాధించిన చిత్రాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు.

నందమూరి బాలకృష్ణ సహా విజేతలకు అభినందనలు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ అవార్డులు(National Awards) సాధించిన చిత్రాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. తెలుగు సినిమాలకు ఏడు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ అవార్డులు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. 'బాలకృష్ణ(Balakrishna) భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా, VFX విభాగం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ విభాగాల్లో హనుమాన్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేశ్(బేబీ), ఉత్తమ గీత రచయిత కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి(గాంధీ తాతచెట్టు) ఎంపికైనందుకు అభినందనలు' అని ఆయన పేర్కొన్నారు.

Next Story