- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌లో బాలకృష్ణది ప్రత్యేక స్థానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘‘హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటుంది. ప్రజా సేవలో, కళా సేవలో బాలకృష్ణ మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.






