నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు

by Vemula.Srinu Prasad |

నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు...

నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: దీప కాంతులతో శోభాయమానంగా... సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉందని, మనకు జీవన శైలిని నేర్పుతుందని ఆయన తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి(Dipavali)ని నిర్వహించుకుంటామన్నారు. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

‘‘ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Next Story