Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు

by Gantepaka Srikanth |

చేనేత... మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Pawan Kalyan: చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చేనేత... మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు, మన కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత(Handloom Sector) ఒకటని అన్నారు. ఈ రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఊతమిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తుందని వెల్లడించారు. సొసైటీల నుంచి ఆప్కో కొనేవాటికి జీఎస్టీపై 5% రాయితీ అమలు చేయడంతోపాటు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమైందని అన్నారు. చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేత వస్త్రాలు వినియోగం పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలు పెంపొందిస్తామని అన్నారు. యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.

Next Story