CM పవన్ కల్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్?.. చంద్రబాబు పరిస్థితేంటో తెలుసా?

by Gantepaka Srikanth |
CM పవన్ కల్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్?.. చంద్రబాబు పరిస్థితేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో జనసేన నేతలు(Janasena Leaders) మరో కీలక డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(AP Deputy CM) పదవిలో చూడాలనుకోడం తప్పేం కాదని.. కానీ తమకు కూడా పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. ఆయన్ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు అధినేతలు ఏ ఒప్పందంతో జట్టు కట్టారో అదే కొనసాగిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్(TDP High Command) స్పందించి ఆ పార్టీ నేతలకు చురకలు అంటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దొద్దని హెచ్చరించింది. ఈ అంశంపై ఇకనుంచి ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ నేతలను ఆదేశించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది.

అయితే పార్టీ అధిష్టానం ఈ ప్రకటన చేసిన కాసేపటికే స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా మంత్రి భరత్(Minister Bharath) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా భవిష్యత్ సీఎం లోకేషే’ అని వ్యాఖ్యానించారు. అయితే స్వయంగా చంద్రబాబు ఎదుటే భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం కూటమిలో కలకలం రేపుతోంది. భరత్‌ కంటే ముందు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ(Pithapuram Constituency) నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్టానం భావించి నేతలకు పలు సూచనలు చేసింది. కానీ ఇంకా ఈ అంశంపై కూటమి పెద్దలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరిలు స్పందించలేదు. ఈ డిమాండ్‌ కూటమిలో చిచ్చురేపుతుందా? లేక అంతవరకు తెచ్చుకోకముందే అధినేతలు చర్చించుకొని సమస్యను వ్యూహాత్మకంగా సాల్వ్ చేస్తారా? అనేది అధినేతల రియాక్షన్ తర్వాత తెలుస్తుంది. అసలు ఈ డిమాండ్‌పై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇదిలా ఉండగా.. లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్‌ వేళ సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఉప రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అంటూ పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed