- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ ఘటన పై చర్యలు తీసుకోవాలి’.. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
హైదరాబాద్(Hyderabad)లోని ఓ తెలుగు మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని ఓ తెలుగు మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆఫీస్ డోర్లు, స్టూడియో తో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఈ తరుణంలో హైదరాబాద్‌లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడిని ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ‘‘మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ తెలంగాణ(Telangana) ప్రభుత్వాని(Government)కి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Read More.. మీడియాపై దాడులేంటి?.. మహా న్యూస్ ఆఫీస్‌పై BRS దాడిని ఖండించిన CM చంద్రబాబు






