Pawan Kalyan: జనసేన శ్రేణుల్లో ఆందోళన.. పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం, హైదరాబాద్‌కు తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-31 15:11:58  IST  )

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు.

Pawan Kalyan: జనసేన శ్రేణుల్లో ఆందోళన.. పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం, హైదరాబాద్‌కు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఫీవర్ ఎక్కువ అవ్వడంతో ఆయనను తన సహాయకులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలించారు. అయితే, నిన్న, ఇవాళ పవన్‌ ఆయన పోటీ చేయబోతున్న పిఠాపురంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకుని మధ్యాహ్నం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ, బీజేపీ నాయకులతో హోటల్‌లో భేటీ అయ్యారు. అనంతరం గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌‌కు బయలుదేరనున్నారు. రేపు ఉదయం పీఠాపురానికి చేరుకుని, రెండు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పవన్ ప్రచారంలో పాల్గొంటారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

Read More..

BREAKING: ఎన్నికల వేళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం

Next Story