స్టీల్ ప్లాంట్ మృతులకు భారీ ఆర్థికసహాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-09 07:11:41  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ మృతులకు భారీ ఆర్థికసహాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించిన అనంతరం.. స్టీల్ ప్లాంట్ కు వెళ్లిన ఆయన అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిటీ వేశామని, త్వరలోనే కమిటీ దీనిపై నివేదిక ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత వ్యక్తుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. క్షతగాత్రులతో మాట్లాడినపుడు గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా అని అడగ్గా.. లేదని చెప్పారన్నారు. చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కంపెనీల్లో ప్రమాదాలు జరిగాయి కానీ.. ఈ తరహా ప్రమాదాలు జరగలేదని తెలిసిందన్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమై.. వారి సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. ప్రతీ కార్మికుడు రిటైర్మెంట్ వరకూ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చన్నారు.

ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంతమేర ఉందన్నదానిపై విచారణ జరుగుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకూ చేస్తున్నాయి? చిన్న చిన్న లోపాలుంటే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారా ? వయోలేషన్స్ పై యాక్షన్ తీస్కున్నారా? వయోలేషన్స్ ఉన్నాయని చెప్పినా ఎవరూ రెస్పాండ్ కాలేదని కార్మికులు చెప్తున్నారని పేర్కొన్నారు. వీటన్నింటిపై నేరుగా కార్మికులతోనే చర్చిస్తామని, ఒకరోజు వారితో సమావేశమవుతామని తెలిపారు. ప్రమాదంలో మరణించినవారిలో రెగ్యులర్ ఎంప్లాయిస్ కు రూ.1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.45.75 లక్షలు, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు అందజేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.

స్టీల్ ప్లాంట్ క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ.. జీవితాంతం అండగా ప్రభుత్వం

Next Story