స్టీల్ ప్లాంట్ క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ.. జీవితాంతం అండగా ప్రభుత్వం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-09 07:14:10  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు విరివిగా పరామర్శించారు.

స్టీల్ ప్లాంట్ క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ.. జీవితాంతం అండగా ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు విరివిగా పరామర్శించారు. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పవన్ కల్యాణ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముగ్గురు బాధితులను, వారి కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. ఘటన జరిగినపుడు షిఫ్టులో ఎంతమంది ఉన్నారన్న దానిపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కిమ్స్, సెవెన్ హిల్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాస్ లను పరామర్శించిన ఆయన ప్రభుత్వపరంగా అన్నివిధాలా బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామన్నారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ మృతులకు భారీ ఆర్థికసహాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్

Next Story